పరమ పిత నిలయం

మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకములో జన్మింపక ముందు, ఇశ్రాయేలు దేశములోని బేత్లేహేము అనే గ్రామమును గూర్చి అనేక దేశాలు ఎరిగియుండలేదు. మన సృష్టికర్తయైన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించుటలో ఎంతో ఔదార్యము కలిగి ఒక చిన్న గ్రామమును ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వారు బేత్లేహేములో జన్మించిన తరువాత అనేక మంది బైబిల్ పండితులు లోక రక్షకుడు మారుమూల గ్రామములో జన్మించుటకు గల కారణాలను విశ్లేషించుటకు ప్రయత్నించెను.

పరమ పిత నిలయం అను మందిరము ఏప్రిల్ 8, 2008 వ సంవత్సరమున బ్రదర్. హోసన్నగారిచే కృష్ణా జిల్లా లోని గొల్లపాలెం గ్రామములో ప్రారంభించబడెను. దేవుడు బ్రదర్. హోసన్న గారికి ఆజ్ఞాపించిన ప్రకారము 3 నెలల 15 రోజులు మౌనః ప్రార్ధన చేసి ఈ మందిరమును ప్రారంబించెను. మౌనః ప్రార్ధన అనగా "దేవునితో నిశ్శబ్దమైన సమయం". దేవుని స్వరమును వినుటకు బహు అనువైన సమయం మౌనః ప్రార్ధన. ఆత్మలో లోతైన సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొనుటకు బలమైన మార్గము ఈ మౌనః ప్రార్ధన. సరళముగా చెప్పాలంటే, సహజ ప్రార్ధనలో ప్రార్ధించే వ్యక్తి స్వరము మాత్రమే వినబడుతుంది. కానీ మౌనః ప్రార్ధనలో కేవలము దేవుని స్వరము మాత్రమె వినబడును.

బంగాళాఖాతమునకు అతి సమీపమున ఉన్నగ్రామము చిన గొల్లపాలెం. అంతేకాక, పరమ పిత నిలయం ఒక మామిడి తోట మధ్యలో నిర్మించబడుట చేత ప్రశాంతమైన వాతావరణమును మరియు పరిసరాలను ఈ మందిరము కలిగియున్నది. కేవలము 5 సం. ల క్రితము నిర్మించినప్పటికీ, దేవుని యొక్క మహాశక్తి చేత వేగముగా అభివృద్ధి చెందుచున్నది. పరమ తండ్రిని ఆరాదించుటలో ఈ గ్రామ ప్రజలు ఎంతగానో సంతోషించుచున్నారు. అనేక ఆత్మలను పాపపు సంకెళ్ళ నుండి విడిపించి, రక్షణ మార్గములో ఆశీర్వదించుచూ దేవుడు తన అమూల్యమైన ప్రేమను కనపరుచుచున్నారు.

పరమ పిత నిలయం సంఘసభ్యులు సమాజములో ఆర్ధికముగా బలహీనమైన వారైనప్పటికీ, దేవుని నిత్య రాజ్యములో బహు సంపన్నులనుగా దేవుడు ఆశీర్వదించెను. దేవునిలో సంతోషము, జీవితములో సమాధానము మరియు పరలోకపు దీవెనలతో దేవుడు ఈ సంఘమునకు అనుగ్రహించిన వరములు. బ్రదర్. హోసన్న గారు ఈ పరమ పిత నిలయంను నెలకు ఒకమారు దర్శించి దేవునిని ఆరాధించెదరు. దేవుని ద్వారా అభిషేకించబడిన దైవజనులు ప్రతీ ఆదివారము ఆరాధన జరిగించెదరు. శరీరమునకు స్వస్థత, ఆత్మకు రక్షణ కలుగచేయు సర్వోన్నతుని నామమున ఈ వెబ్ సైట్ వీక్షించుచున్న వారికి నిండు హృదయాలతో దేవుని ఆరాధించుటకు ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానము.

 

పరమ పిత నిలయం ప్రత్యేకతలు:
  • ఆత్మను ఉజ్జీవింపచేయు ఆరాధన ప్రతీ ఆదివారము ఉ. 10 గం. ల నుండి 1 గం. వరకు
  • స్వస్థత భరితమైన ఉపవాస ప్రార్ధన ప్రతీ శుక్రవారము ఉ. 11 గం. ల నుండి 2 గం. వరకు

 

Route Map: