క్రీస్తు దర్శన ఆలయం

మౌలాలి, హైదరాబాద్-40

ఆలయ వ్యవస్థాపకులు: బ్రదర్. కె. హోసన్న (అన్నయ్య)గారు

హైదరాబాద్ నగరంలో మౌలాలి ప్రాంతంలో ఒక ఎత్తైన కొండలు, గుట్టలు ఉన్న స్థలంలో బ్రదర్. హోసన్న భీమవరం నుంచి వచ్చి ఆలయం నిర్మించి 2004 జూన్ 9న క్రీస్తు దర్శన ఆలయాన్ని ప్రారంబించి ప్రతి బుధవారము ఆలయానికి వచ్చి, వచ్చే 4,5 సభ్యులతో ప్రార్ధన జరిపించేవారు. అనేక చర్చిలు ఆ ప్రాంతంలో ఉండగా ఈ చర్చికి ఎవరు వస్తారని అనేక మంది నవ్వారు. అన్యజనుల మధ్యన ఉన్న ఈ చర్చిలో అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగించి నడిపిస్తున్నారు.

అన్యజనులు మద్యన ఉన ఈ చర్చిలో అనేకమయిన అద్భుత కార్యాలు దేవుడు జరిగించి నడిపిస్తునారు.

ఈ చర్చిలో జరిగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమములు:
  • ప్రతి ఆదివారము:- ఆరాధనా క్రమము - 10 గం. నుండి 12 గం.ల వరకు నడిపించబడుతుంది.
  • ప్రతి బుధవారము:- ఆలయమునకు వచ్చిన భక్తులందరూ కలసి ప్రార్ధనలు చేస్తారు.
  • ప్రతి శుక్రవారము:- దేవుడు బ్రదర్. హోసన్న(అన్నయ్య) గారితో ఏర్పాటు చేసిన 7 ప్రార్ధనల వారితో విజ్ఞాపన ప్రార్ధన.
  • భక్తుల కోరిన యెడల వారి వారి గృహాలకు వెళ్లి 7 ప్రార్ధనల వారు ప్రార్ధిస్తారు.

నెలలో మొదటి బుధవారము బ్రదర్. హోసన్న (అన్నయ్య) గారు రావడం, ఉదయం నుండి రాత్రి వరకు చర్చిలో ఉండి విచ్చేసిన భక్తులకై ప్రార్ధిస్తారు. ఉదయం 11.00 గం. నుండి మధ్యాహ్నం 2 గం.ల వరకు ఆరాధన జరిపిస్తారు. సాయంకాలం 6.00 గం.ల నుండి రాత్రి 8.30 గం.ల వరకు మరో ఆరాధన జరిగించి రాత్రి తిరిగి భీమవరం వెళ్తారు.

ప్రతి బుధవారము 5 సం. ల నుండి క్రమం తప్పకుండా విచ్చేసిన భక్తులందరికి దేవుడు చక్కటి విందును ఏర్పాటు చేయడం ఈ ఆలయంలో ఓ ప్రత్యేకత. అనేక మంది భక్తులు ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి భోజనం (విందు) ఏర్పాటు చేయడం ఆశ్చర్యం.

ఇక్కడ మొక్కుబడి చేస్తే తమ కార్యాలు సఫలం అవుతాయని అనేక మంది సాక్ష్యాలుగా చెప్తూ ఉంటారు. ఇందులో తెలియపరచినవి కొన్ని మాత్రమే. ఇంకా మరి ఎన్నో కార్యాలు, దేవుని పుట్టిన రోజు వేడుకలు, ఉపవాస ప్రార్ధనలు జరిగించుట దేవుడు ఈ ఆలయానికి ఇచ్చిన ఘనత.

map-generator.net