పరమ యెరూషలేము ప్రార్ధనా మందిరము

ప్రభువైన యేసు క్రీస్తు బేత్లేహేము అనే ఒక చిన్న గ్రామమున జన్మించెను. ఈ శుభవార్తను దేవత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై తెలియచేసెను. కొత్త నిబంధనలోని లూకా సువార్త ప్రకారము యేసు క్రీస్తు వారు ఒక పశువుల తొట్టెలో జన్మించుట ద్వారా, ఆయన ఒక సామాన్యునిగా ఈ లోకమునకు వచ్చియున్నాడు. ఆయన తప్పిపోయిన తన ప్రజలను వెదికి రక్షించుటకు ఈ భూలోకానికి వచ్చెను.

ఏప్రిల్ 4, 1995, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణములోని ఒక మారుమూల ప్రాంతములో పరమ యెరూషలేము ప్రార్ధనా మందిరమును దేవుని చేత కేవలము ముగ్గురు వ్యక్తులతో స్థాపింపబడెను. పరమ యెరూషలేము దేవాలయములో దేవుడు అనేక ఆత్మలను పాపపు బంధకాలనుండి విడిపించి ఆయన కృపను అనుగ్రహించుచున్నాడు. అవును, ఒక ఆత్మను రక్షించడం మానవులకు సాధ్యం కాదు గనుక, స్వయముగా దేవుడే తన కార్యమును జరిగించుచున్నాడు. ఈ దేవాలయము సర్వశక్తుని ఆధీనములో వున్నది గనుక అనతి కాలంలోనే, దేవుని ద్వారా అభివృద్ధి పొందుకొనెను, అంతేకాక అనేక ఆత్మలను రక్షించి తన స్వకీయ జనముగా దేవుడు ఆశీర్వదించెను. దేవ దేవుని మహా శక్తి ద్వారా అనేక మంది తమ పాపాలనుండి, దుఃఖాలనుండి, వేదనలనుండి, భాధలనుండి విముక్తి పొందుకొని, పరిశుద్ధాత్మను అనుభవిస్తూ ముందుకు సాగిపోవుచున్నది. ప్రతీ ఆదివారము పరిశుద్ధాత్మను ప్రతీ ఒక్కరూ అనుభవించుచున్నారు, ఎందుకంటే ఆరాధన నడిపించువాడు ఆయనే... ప్రియ సహోదరీ, సహోదరుడా, పరిశుద్ధాత్మను ప్రత్యక్షముగా అనుభవించాలని ఆశ పడుతున్నారా... రండి పరమ యెరూషలేమును దర్శించండి, పరిశుద్ధాత్మను మీ హృదయములోనికి ఆహ్వానించండి.

పరమ యెరూషలేము దేవాలయములో, దేవుడు తన ప్రత్యేకమైన నూతన నిబంధన సింహాసనమును ఏర్పరచుకొనెను. ఆ పరిశుద్ధ సింహాసనములో ఆసీనులై, పరమ యెరూషలేము నిర్మాణమును జరిగించటానికై సిద్ధపడుచున్నారు. ఈ పరమ యెరూషలేము మందిరము ప్రపంచములోని తన జనులకు మూల స్తంబముగా ఉండబొవుచున్నది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రార్ధనా బృందము పరమ యెరూషలేము కుటుంబము కొరకై అను నిత్యము దేవునికి ప్రార్ధన చేయటం ఒక ప్రత్యేకతను సంతరించుకొనుచున్నది.

పరమ యెరూషలేము ప్రత్యేకములు:
  • ప్రతీ ఆదివారము శక్తివంతమైన ఆరాధన ఉ 10గం నుండి మ 1గం వరకు
  • బలమైన పునాది కొరకు చిన్న పిల్లలకు ప్రత్యేకమైన సండే స్కూల్ ఉ 9గం నుండి ఉ 10గం. వరకు
  • ప్రతీ మంగళవారము మౌనః ప్రార్ధన ఉ 8గం నుండి మ. 4గం వరకు
  • ప్రతీ శుక్రవారము ఫలభరితమైన ఉపవాస ప్రార్ధన ఉ 11గం నుండి మ 4గం వరకు మరియు సంపూర్ణ రాత్రి ఆరాధన రా 8గం నుండి ఉ 4గం వరకు
  • ఏడు రోజుల ఉపవాస ప్రార్ధనలు మరియు ప్రేమ విందు - సంవత్సరమునకు 3 సార్లు
  • అభిషేక ఆరాధనలు - సంవత్సరమునకు 3 సార్లు
  • బాప్తిస్మ కార్యక్రమములు - సంవత్సరానికి 3 సార్లు
  • క్రిస్మస్ మహా ఊరేగింపు ప్రతీ సంవత్సరం డిసెంబర్ 24 వ తేదీన
  • ప్రత్యెక యూత్ క్రిస్ట్మస్ పండుగలు

Route Map: