నా పేరు నమ్రత, నా సాక్ష్యం .......

పరమ తండ్రి యేసు ప్రభువు వారు నా జీవితంలో అనేకమైన అద్భుత సూచక క్రియలు జరిగించారు. యేసు ప్రభువు నా జీవితంలో ప్రవేశించక ముందు నేను కటిక చీకటిలో ఉన్నాను. దేవుడు నన్ను పట్టుకున్న తరువాత నా జీవితం చీకటి నుంచి వెలుగులోనికి ప్రవేశించింది. 1999 వ సంవత్సరం దేవుని మాట ప్రకటిస్తున్న యేసయ్యతో హోసన్న అని పిలిచే అందరికి అన్నయ్యగా పరిచయమయిన ఈ ప్రవక్త అన్నయ్యగారు సొంత పని మీద హైదరాబాద్ వచ్చి నా అదృష్టం కొద్ది మా ఇంటికి వచ్చారు. అన్నయ్యని మా కుటుంబ సబ్యులు చూడటం అదే మొదటిసారి 1999 నుంచి 2001 వరకు అనేక సందర్భాలలో నేను అన్నయ్యగారిని కలిసాను. 2001 సం.లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఒక ప్రక్క నా ఆరోగ్యం, మరో ప్రక్క చదువు ఒత్తిడి ముఖ్యంగా నాకు మాథ్స్ అంటే భయం. అపటికే నేను ఫెయిల్ అయి ఉన్నాను. ఈ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను.

నా తల్లిదండ్రులకు కూడా తెలియని ఈ రహస్యం దేవుని ద్వార గుర్తించి ప్రార్ధన చేసి నాలో ఉన్న చీకటిని తొలగించారు. నువ్వు యేసయ్యను ప్రార్ధించు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి, ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుని వాక్కు నాకు వినిపించారు. ప్రతి బుధవారం అన్నయ్య గారి రాకతో మా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. నేను డిగ్రీ కూడా పాస్ అయ్యాను. దేవుని వాక్కు అన్నయ్య గారి ద్వారా నువ్వు ఉద్యోగం చేస్తావని. కానీ డిగ్రీ చదివిన నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారని నాకు అయితే నమ్మకం కలగలేదు. అయిన దేవుని వాక్కు వలన ఓ చిన్న కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. జీతం తక్కువ కష్టం ఎక్కువ. ఉద్యోగం మానెయ్యాలి అని ఆలోచనతో ఉన్నాను. నా మనసులోని మాట అన్నయ్య గారి ద్వారా దేవుడు బయట పెట్టి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందని దేవుడు వాక్కు ఇచ్చాడు. అక్టోబర్ 5, 2007 న దేవుని వాక్కు ప్రకారం ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నా కంటే సీనియర్ ఎంతో మంది ఉండగా యాజమాన్యం నన్ను గుర్తించి 6 నెలలకు ఒక ప్రమోషన్ చొప్పున ఇచ్చి నన్ను ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచారు. 4000 జీతంతో మొదలైన నా ఉద్యోగం 24,000 వరకు సాగుతుంది ఇలా నా ఉద్యోగం సాగుతుంటే ఇది కేవలం నా ఆత్మీయ తండ్రితో దేవుడిచిన మాట ఈ సమయంలో నాకు పెళ్లి చేయాలనీ నా తల్లి తండ్రులు సంబంధాలు వెతుకుతూ ఉండగా అనేక సంబందాలు వచ్చిన అవతల వారు క్రెస్తవులు కానందున మా కుటుంబం ఒప్పుకోలేదు.

ఈ పెళ్లి విషయంలో మా కుటుంబం మా కుటుంబం ఎంతో వేదన చెంది ఉండగా పెళ్లి కుమారుడు హైదరాబాద్ లో ఉన్నాడని అన్నయ్య గారి ద్వారా దేవుడు మాట ఇచ్చాడు. మాట మాట ఇచ్చి 3 సంవత్సరాలు అయినా వివాహం కాలేదని నా తల్లితండ్రులు ఎంతో ఆందోళనతో ఉండగా హైదరాబాద్ లో పనిచేస్తున్న సురేష్ కుటుంబంతో మా కుటుంబం మొదటిసారి ఫిబ్రవరి 2, 2012 న కలవడం జరిగింది. దేవుని మాట, నా మదిలోని కోరిక, సురేష్ నోట మీ ఇంటికి అల్లుడుగా కాదు కొడుకుగా వస్తాను అన్న మాట విని మా కుటుంబం గొప్ప దేవుని వాక్కు నెరవర్తించబడినదని ఎంతో ఆనందించాము. ఫిబ్రవరి 19, 2012న మా నిశ్చితార్దం అనుకోని రీతిలో దైవజనులు, పెద్దల సమక్షంలో ఆనందంగా దేవుడు జరిపించారు. ఇది నా జీవితంలో మరువరాని రోజు.

ఏప్రిల్ 11, 2012 బుదవారం దైవజనులు శారమ్మ గారు, ఇతర దైవజనులు సమక్షంలో దైవజనులైన హోసన్న (అన్నయ్య) గారి చేతులు మీదగా ఉహించని రీతిలో ఘనంగా మా వివాహం క్రీస్తు దర్సన ఆలయం (హైదరాబాద్) లో జరిగించబడింది. ఈ వివాహం అన్నయ్య గారి చేతులు మీదుగా జరిగించాలన నా కుటుంబ సభ్యుల కోరికను దేవుడు అనుమతించి జరిగించినందుకు నా తల్లి తండ్రులు, నా తమ్ముడు ఎంతో ఆనందించారు. నా వివాహం కోసం ప్రార్ధించిన మా చర్చి సభ్యులు అందరు ఎంతో ఆనందించారు. ఈ వివాహ వేడుకను చూసిన అన్యజనులు, మా బందు మిత్రులు వర్గం, మాతో కలవని బంధువులుతో సహా అనేకులు ఇది నిజామా అని వారిలో వారు చర్చించుకుంటున్నారు. ఈ ఘనమైన వివాహంతో పాటు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించింది, మా కుటుంబం సభ్యులు మరి ఎవరు కాదు ఆ దేవాది దేవుడు అయిన యేసయ్య మాత్రమే. నా, మా గురించి ప్రార్ధించిన అన్నయ్య గారికి నా వందనాలు. అన్నయ్య నోటి ద్వారా దేవుడు ఇచ్చిన వాక్కులు నెరవర్తించబడినందుకు దేవాది దేవునికి నా నిండు వందనాలు.

ఈ సాక్షం చదివిన మీ అందరికి నా వందనాలు.

ఇట్లు
నమ్రత సురేష్.